జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. హీరో ప్రభాస్ నటించి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్‌ను అందుకుంది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.