Namaste NRI

ది రాజా సాబ్‌ టీజర్‌ వచ్చేసింది

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మారుతి ద‌ర్శక‌త్వంలో ది రాజా సాబ్ చిత్రం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే.  నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలు. మారుతి దర్శకత్వం. ప్రతిష్టాత్మక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ప్రభాస్‌ నాతో సినిమా చేస్తున్నారనగానే చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి. వారందరికీ సరైన సమాధానమిస్తుందీ సినిమా. ప్రభాస్‌గారిని కలిసినప్పుడు ఆయన ఫస్ట్‌ నాతో అన్నమాట మీ ప్రేమకథాచిత్రమ్‌, భలేభలే మగాడివోయ్‌ సినిమాలంటే నాకిష్టం.. అలాంటి సినిమా చేద్దామా అని, అప్పుడే ఆయనకు ఓ లైన్‌ చెప్పా. ఆ తర్వాత గోపీచంద్‌తో నేను చేసిన పక్కా కమర్షియల్‌ సరిగ్గా ఆడకపోవడంతో,పాన్‌ ఇండియా స్టూపర్‌స్టార్‌ అయిన ప్రభాస్‌తో ఈ టైమ్‌లో నేను సినిమా చేయడం కరెక్ట్‌ కాదనిపించింది. ఇంతలో ఆయనే ఫోన్‌ చేసి, అప్పుడు మీరు చెప్పిన కథలో ఈ పాయింట్స్‌ బావున్నాయి  అంటూ చెప్పడం మొదలుపెట్టాన్నారు.

 

ఆయనకి ఈ కథ అంత నచ్చినప్పుడు మనం మాత్రం ఎందుకు వెనకడుగేయాలి? అని చాలెంజ్‌గా తీసుకొని ది రాజాసాబ్‌ మొదలుపెట్టాను. మన ఫ్యాన్స్‌ వండర్‌ఫుల్‌ ఫ్యాన్స్‌ డార్లింగ్‌, వాళ్లకు మంచి మూవీ ఇవ్వాలి అని ప్రభాస్‌ అంటుంటారు. ఈ సారి బుజ్జిగాడి  ైస్టెల్‌ వింటేజ్‌ ప్రభాస్‌ని చూస్తారు. ఇంకా కొంత షూటింగ్‌, సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉంది అని పేర్కొన్నారు. తమ సంస్థలోనే ఇది బెగ్గెస్ట్‌ మూవీ అనీ, మేకింగ్‌ గ్రాండియర్‌గా ఉంటుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఇంకా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌, డీవోపీ కార్తీక్‌ పళని, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events