ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ భయాందోళనకు గురికావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అదేవిధంగా భారత పౌరులు రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని అడ్వయిజరీలో పేర్కొంది. ఇరాన్‌లోని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా అకౌంట్‌ను అనుసరించాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలి అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
