Skip to main content

Namaste NRI

990 కోట్ల విల్లాలో గర్ల్‌ఫ్రెండ్‌తో పుతిన్ రహస్య జీవితం

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం  మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. జిమ్నాస్ట్, ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్‌   అయిన 39 ఏండ్ల అలీనా కబయేవా తో పుతిన్ కు ఉన్న బంధం. వీరిద్దరూ రిలేషన్‌లో  ఉన్నట్లు గతంలో తెగ ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలపై పుతిన్ ఎప్పుడూ స్పందించలేదు. కాగా, వీరిద్దరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం పుతిన్  తన గర్ల్‌ఫ్రెండ్‌  అలీనా  తో కలిసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలో సీక్రెట్‌గా  గడుపుతున్నట్లు రష్యన్ ఇన్వెస్టిగేటివ్​న్యూస్  సైట్ ది ప్రాజెక్ట్ తెలిపింది.  ఆమె కోసం పుతిన్ సైప్రస్‌లో  రూ.990 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు.   మాస్కో కు వాయువ్యంవైపు ఉన్న లేక్​వాల్దై  కు సమీపంలోని ఓ ఎస్టేట్‌లో  వీరు రహస్యంగా ఉంటున్నట్లు వెల్లడించింది. ప్యాలెస్‌లో  అలీనా కబయేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పినట్లుగా ది ప్రాజెక్ట్ తన కథనంలో పేర్కొంది. అలీనాకు చెందిన మహిళా బంధువులు కూడా ఎస్టేట్‌లోనే  ఉన్నట్టు వివరించింది.

Social Share Spread Message

Latest News