ట్విట్టర్‌కు సరికొత్త రూపు తీసుకొస్తానన్న ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో నుంచి పిట్టను తొలగించి ఎక్స్ ను ఆవిష్కరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఎక్స్‌ను ప్రదర్శించగా, ఈ ఫొటోను ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ డాట్‌కామ్ ఇక నుంచి ద ఎక్స్.కామ్ గా రీడైరెక్ట్ చేస్తున్నట్టు మస్క్ ప్రకటించారు. నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు రంగులోని ఎక్స్ అనే గుర్తును మస్క్ ఎంచుకున్నారు. కంప్యూటర్లన్నింటిపైనా కొత్త లోగో కనిపించగా, మొబైల్ యాప్‌లో పాత లోగో పిట్ట కొనసాగటం గమనార్హం.