కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు. రాహుల్ గాంధీ సెప్టెంబరు 7 నుంచి 11 వరకు బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఆయన బ్రిటన్, అమెరికాలలో పర్యటించిన సంగతి తెలిసిందే.