గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాటను మార్చి 2న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ పాట ద్వారా హీరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా గ్లింప్స్ ఇప్పటికే గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ఏప్రిల్ 30న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.















