Skip to main content

Namaste NRI

రామ్ చరణ్ పెద్ది సెకండ్ సింగిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాటను మార్చి 2న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ పాట ద్వారా హీరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివ‌రాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా గ్లింప్స్ ఇప్పటికే గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ఏప్రిల్ 30న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

Social Share Spread Message

Latest News