Skip to main content

Namaste NRI

బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో రామ్‌చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన తరువాతి చిత్రాన్ని సంచలనాల దర్శకుడు శంకర్‌తో చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ దిల్‌రాజు శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే రాజమండ్రిలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ లో జరుగుతోంది. అక్కడే కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ విరామంలో ఆయన కొంత సమయం బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఖాసా అమృత్‌సర్‌లోని సరిహద్దు భద్రతా దళం క్యాంప్‌లో సైనికుల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావ గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపా అంటూ జవాన్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు.  కాగా, అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో రామ్‌ చరణ్‌ ముచ్చటించారు.  తన మూవీ కోసం తీసుకొచ్చిన హైదరాబాద్‌ చెఫ్‌తో వారి కోసం ప్రత్యేంగా వంటలు చేయించారు. ప్రత్యేక వంటలు  చేయించి వారితో కలిసి భోజనం చేశారు.  శంకర్‌` రామ్‌చరణ్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో కథానాయికగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News