రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రా న్ని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మూడో సాంగ్ ఈగల్స్ ఆన్ హిస్ మే ను కూడా లాంఛ్ చేశారు. ఈ పాటను దావ్ జాంద్ కంపోజిషన్‌లో జార్జినా మాథ్యూ స్వయంగా రాసి పాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి దావ్ జాంద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
