అమెరికా తమ దేశంపై దాడిచేస్తుందేమోనని తాము అంచనా వేశామని, అందుకు తాము కూడా ప్రతిదాడికి సిద్ధమయ్యాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దాంతో ఈ అంశంపై కెనడా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

అయితే అమెరికా దాడిచేసే అవకాశం ఉందని తామిప్పుడు భావించడం లేదని కార్నీ స్పష్టంచేశారు. అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితులను కూడా పరిశీలించడం ప్రధానిగా తన బాధ్యతని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం బాధ్యతారాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు. అమెరికా, కెనడా మధ్య గత ఏడాది నుంచి వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలు విధించింది.















