ఫ్యాషన్ ప్రియులకు, అడిడాస్ సంస్థ వైట్ సాంబా స్నీకర్స్‌ను ప్రేమించేవారికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణ చెప్పారు. తెలుపు-నీలం రంగు చొక్కా, ప్యాంట్ కాంబినేషన్‌లో అడిడాస్ సంస్థ వారి తెలుపు రంగు సాంబా బూట్లు ధరించి రిషి సునాక్ ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. స్నీకర్స్‌కు ప్రత్యేక ట్రెండ్ ఉందని, వాటిని సునాక్ దెబ్బ తీశారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. దీంతో వాటికి సునాక్ స్పందిస్తూ సాంబా లవర్స్‌కు క్షమాపణలు చెప్పారు. తాను కొన్నేండ్ల క్రితమే అడిడాస్ కంపెనీ ఉత్పత్తులకు అభిమానిగా మారిపోయానన్నారు. తన ఆహార్యంపై ఇతరుల దృష్టి ఆశ్చర్యం కలిగించిందని నవ్వేశారు.