Skip to main content

Namaste NRI

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుల దుర్మణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మణం పాలయ్యారు.  మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. యూనియన్‌ కౌంటిలోని ఇల్లినాయిస్‌ రూట్‌ నెం. 3 దగ్గర రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ కార్బన్‌డోల్‌లో చదువుకుంటున్నారు. వంశీకృష్ణ పెచ్చెట్టి నగరంలోని నిజాంపేటకు చెందినవారు. వంశీకృష్ణ మరణ వార్త వినగానే రెడ్డి రెవిన్యూలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఈ ప్రమాదంలో మరణించిన మరో విద్యార్థి పవన్‌ స్వర్ణ  స్వస్థలం ఖమ్మం. కల్యాణ్‌ ద్రోణ, కార్తిక్‌ కాకుమాను, యశ్వంత్‌ ఉప్పలపాటి గాయపడిన వారిలో వున్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల మృతికి యూనివర్సిటీ కూడా సంతాపం తెలిపింది.

Social Share Spread Message

Latest News