
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం రోటీ కపడా రొమాన్స్. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు. తొలుత ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్‌లో థియేటర్లు దొరకని కారణంగా సినిమా విడుదలను ఈ నెల 28కి వాయిదా వేశారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఈ నెల 22 నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశామని మేకర్స్ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్ మూవీ ఇది. యువతరం మెచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే వేసిన షోలకు మంచి స్పందన వస్తున్నది అని చెప్పారు.
