Namaste NRI

సర్దార్ 2 షూటింగ్ షురూ

తమిళ హీరో కార్తీని నటుడిగా మరోస్థాయిలో నిలబెట్టిన సినిమా సర్దార్‌. ఆ సినిమాకు పార్ట్‌ 2 కూడా ఉంటుంద ని మేకర్స్‌ అప్పుడే ప్రకటించారు. ఇటీవలే సర్దార్‌ 2కు సంబంధించిన పూజాకార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ నెల 15న చెన్నైలో నిర్మించిన భారీ సెట్స్‌లో షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ తెలిపారు. ప్రీక్వెల్‌కు దర్శకుడైన పి.ఎస్‌.మిత్రన్‌ సర్దార్‌ 2కి కూడా దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌ సి.విలియమ్స్‌, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాణం: ప్రిన్స్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events