సౌదీ అరేబియా సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నియోమ్ ప్రాజెక్టు కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భూ సేకరణకు ఇబ్బందులు ఎదురైతే ఆయా ప్రాంతాల్లోని గ్రామస్థులను చంపాల ని భద్రతా బలగాలను ఆదేశించినట్టు తెలిసింది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ విజన్-2030లో భాగంగా నియోమ్ పేరుతో కలల నగరాన్ని నిర్మించాలని ప్రణాళిక రచించారు. ఈ నగరం న్యూయార్క్ కంటే 33 రెట్లు పెద్దగా ఉంటుంది.