Skip to main content

Namaste NRI

ప్రవాసుల ఎంట్రీపై సౌదీ ఆంక్షలు

హౌజ్‌ యాత్ర నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాలో  ప్రవాసుల ఎంట్రీపై ఆంక్షలు విధించింది. అనుమతి లేని ప్రవాసులకు పవిత్ర నగరం మక్కాలో ప్రవేశించడాన్ని నిషేధించింది. ఈ నెల 26 నుండి బ్యాన్‌ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్‌ యాత్రను క్రమబద్ధీకరించే క్రమంలో జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్‌ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్‌ షమీ అల్‌ షువైరెఖ్‌ తెలిపారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్‌ 25 నుంచి మక్కాలోని అనుమతించబడతారని తెలిపారు. అనుమతులు ఉన్నవారు మక్కా ఎంట్రీ సెంటర్ల వద్ద ఉన్న భద్రతా నియంత్రణ కేంద్రాల నుంచి అనుమతి పొందవచ్చని తెలియజేశారు. అవసరమైన ధృవ పత్రాలు లేని నివాసితులు, వారికి సంబంధించిన వాహనాలను తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుందన్నారు.  ఎంట్రీ పర్మిట్‌, మక్కా నుంచి జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్‌( ఇఖామా), ఉమ్రా పర్మిట్‌ ఉన్నవారికి మాత్రమే మక్కాలోని అనుమతి ఉంటుంది.

Social Share Spread Message

Latest News