చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం రికార్డ్ బ్రేక్. చదలవాడ పద్మావతి నిర్మాత. నిహార్, నాగార్జున, రగ్థా ఇఫ్తాకర్ ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను చిత్రబృందం విడుదల చేశారు. మళ్లీ పుట్టి వచ్చినవా అంటూ సాగే ఈ పాటను వరికుప్పల యాదగిరి రాసి, ఆలపించారు. సాబు వర్గీస్ స్వరపరిచారు. పాన్ ఇండియా స్థాయిలో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఈ చిత్రానికి కథ: అంజిరెడ్డి శ్రీనివాస్, కెమెరా: కంతేటి శంకర్.
