భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అమెరికాలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో సమావేశమైనట్టు తెలిసింది. వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చొరవ తీసుకున్నారు. దౌత్య పరమైన సంబంధాలు మెరుగుపర్చుకునే దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను హత్య వెనుక భారత అధికారుల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ఆరోపించడంతో ఇరుదేశాల దౌత్య పరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం విదితమే. అయితే ఈ సమావేశం జరిగినట్లు ఇరుదేశాల అధికార ప్రతినిధులు ఎవరూ నిర్థారించలేదు. అమెరికాలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది వెల్లడికాలేదు.