Skip to main content

Namaste NRI

శర్వానంద్ భోగి మొదలైంది

1960ల నాటి ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రానికి భోగి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలు. సంపత్‌నంది దర్శకత్వం. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలు పెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. విధి, పోరాటం, మార్పు అంటూ దర్శకుడు కథను నరేట్‌ చేస్తుండగా, హీరో శర్వానంద్‌ ఆయన మాటల్ని ఆసక్తిగా వింటూ ఓ యుద్ధం, సంఘర్షణతో కూడిన ప్రపంచాన్ని ఊహిస్తుంటాడు.

తిరుగుబాటుదారుడి వీరోచిత పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తమని అర్థమవుతున్నది. ప్రతి రక్తపు చుక్కకు ఓ కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది అని దర్శకుడు సంపత్‌నంది ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే కథాంశమిదని, అప్పటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టేలా అద్భుతమైన సెట్స్‌కు రూపకల్పన చేస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌, ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.

Social Share Spread Message

Latest News