శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమే. కృతిశెట్టి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఈ చిత్రంలోని తొలిగీతం ఇక నా మాటే ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుం దని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.