Skip to main content

Namaste NRI

శర్వానంద్ మనమే ఫస్ట్ సింగిల్… ఇక నా మాటే విడుదల ఎప్పుడంటే

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమే. కృతిశెట్టి కథానాయిక.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఈ చిత్రంలోని తొలిగీతం ఇక నా మాటే ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్‌ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నారు. యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, శర్వానంద్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుం దని చిత్రబృందం పేర్కొంది.  ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్‌ వీఎస్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిబొట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య.

Social Share Spread Message

Latest News