
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన షేక్ దావూద్‌జీ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను ఈ నెల 26న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నాలో ఏదో అంటూసాగే ఈ రొమాంటిక్ గీతాన్ని శ్రీజో రాయగా, సునీల్ కశ్యప్ స్వరపరిచారు.

దినకర్ కల్వల, అదితి భావరాజు ఆలపించారు. హీరోహీరోయిన్లు మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రధారులు. త్వరలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్ రాఘవ్, కెమెరా: మహిరెడ్డి పండుగుల.
