Skip to main content

Namaste NRI

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఏక్‌ మినీ కథ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన షేక్‌ దావూద్‌జీ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.  ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను ఈ నెల 26న మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నాలో ఏదో అంటూసాగే ఈ రొమాంటిక్‌ గీతాన్ని శ్రీజో రాయగా, సునీల్‌ కశ్యప్‌ స్వరపరిచారు.

దినకర్‌ కల్వల, అదితి భావరాజు ఆలపించారు. హీరోహీరోయిన్లు మధ్య వచ్చే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. వెన్నెల కిశోర్‌, అభినవ్‌ గోమటం, మురళీధర్‌గౌడ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. త్వరలో చిత్రం విడుదల కానుంది.  ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్‌ రాఘవ్‌, కెమెరా: మహిరెడ్డి పండుగుల.

Social Share Spread Message

Latest News