సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై రానున్న తెలంగాణ నేపథ్య కుటుంబకథా చిత్రం ఇడుపు కాయితం. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ కథానాయిక. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి శ్రీలత అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత.. శ్రీలత శ్రీలత శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత.. జీలకర బెల్లాన్ని పెట్టినా.. ఆ నెత్తిపై భారాన్ని పెట్టనే అంటూ సాగే ఈ పాటను అలరాజు రాయగా, సురేశ్ బొబ్బిలి స్వరపరిచారు.

శంకర్‌బాబు, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్లు, పిల్లలతో చేయించిన డ్యాన్స్ సీక్వెన్సులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ తొలివారం విడుదల చేయనున్నారు. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్ బాల్‌రెడ్డి.















