Namaste NRI

వింత జాబ్‌.. ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం

ఈమధ్య కాలంలో కొన్ని వింత వింత ఉద్యోగాల గురించి వింటున్నాం. ఫుడ్‌ టేస్ట్‌ చేయడం, జంతువులకు కేర్‌ టేకర్‌గా ఉండటం, పర్యాటక ప్రదేశాలు చూసి రివ్యూలు ఇవ్వడం వంటి జాబ్‌ల గురించి వింటున్నాం. భారీ వేతనాలు, కళ్లు చెదిరే ఆఫర్లతో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక తాజాగా మరో వింత జాబ్‌ తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే ఎలుకలు పట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఎలుకలు పట్టే ఉద్యోగమే. పైగా ఈ ఉద్యోగానికి ఏకంగా ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం చెల్లించేందుకు ముందుకు రావడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. మరి ఇంతకు ఈ జాబ్‌ ఎక్కడ అంటే న్యూయార్క్‌.  అయితే, ఈ ఎలుకలు ఒకటో రెండు కుటుంబాలో కాదు ఏకంగా న్యూయార్క్‌  నగరం ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

అవి పెట్టే బాధలకు న్యూయర్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ర్యాట్‌ క్యాచర్‌ ను నియమించారు. ర్యాట్‌ క్యాచర్స్‌కు వేతనం అక్షరాలా రూ.1.2కోట్లు ఇస్తుండడం విశేషం. డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌ పేరుతో ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను మేయర్‌ ఆహ్వానించారు. ఇప్పటి వరకు 900 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో కేథలిన్‌ కొరాడీని ఎంపిక చేశారు. ఓ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పని చేస్తుంటారు. విద్యాశాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడడం అంశాలపై రీసెర్చ్‌ చేశారు.

ఈ ఉద్యోగంలో భాగంగా ఆమె ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలకలకు దొరకుండా డిస్పోస్‌ చేయడం, ఎలుకల సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం, సబ్‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలుకల నిర్మూలనలో పలు ఆంక్షలు సైతం విధించడం కొసమెరుపు. ఎలాంటి విషపదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదు. విష ఆహారం తిని చనిపోయిన ఎలుకలను ఏవైనా జీవులు చనిపోయే ప్రమాదం ఉంటుందని,  అందుకే విషయం పెట్టకూడదనే ఆంక్షలు విధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]