Skip to main content

Namaste NRI

ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథ ఇప్పటివరకు రాలేదు.. శివ కందుకూరి

శివ కందుకూరి, రాశీసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. పురుషోత్తమ్ రాజ్ దర్శకుడు. స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ నిర్మాతలు. ఈ సినిమా  మార్చి 31న విడుదలకానుంది. అందులో భాగంగా ఈ సినిమా  టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రెగ్యులర్ గూఢచారి చిత్రాలకు భిన్నమైన కథాంశమిది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో తెలుగులో ఇప్పటివరకు సినిమా రాలేదని హీరో శివ కందుకూరి తెలిపారు. కథను నమ్మి గొప్ప తపనతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా మందికి ఈ కథ నచ్చిందని, తప్పకుండా హిట్ సినిమా అవుతుందని నిర్మాత రాహుల్ యాదవ్ చెప్పారు. హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ తనకు మంచి రోల్ ఇచ్చారు సినిమాలో, మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లా అనిపించింది. ఈ స్టోరీ వినగానే ఈ కేరక్టర్ ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపించిందని, ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events