Namaste NRI

సస్పెన్స్ థ్రిల్లింగ్ ఒరిజిన‌ల్ పులి మేక టీజర్ విడుదల

నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. మ‌రి వారినే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు? భ‌యంక‌ర‌మైన ప‌నులు చేసే వ్య‌క్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో ఓ వ్య‌క్తి అలాంటి ప‌నులు చేస్తే దాన్నెమ‌నాలి. అలాంటి మృగంలాంటి మ‌నిషి సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌ను చేస్తుంటాడు. అయితే అత‌ని టార్గెట్ సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం కాదు. ఏకంగా పోలీసులే. త‌మ డిపార్ట్‌మెంట్ అధికారుల‌ను ఎవ‌రో ఓ వ్య‌క్తి వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? అనే విష‌యాలు తెలియాలంటే జీ 5లో ఫిబ్ర‌వ‌రి 24న స్ట్రీమింగ్ కాబోతున్న‌ పులి మేక  ఒరిజిన‌ల్ చూడాల్సిందే.

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది పులి మేక . ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే జీ 5లో స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్లింగ్‌ ఒరిజిన‌ల్ టీజ‌ర్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినంద‌న‌లు తెలిపారు. 

న‌టీన‌టులు: కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, రాజాగా క‌రుణాక‌ర్ శ‌ర్మ, సిరిగా ప‌ల్ల‌వి, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పంద‌న‌గా ప‌ల్ల‌వి శ్వేత న‌టిస్తున్నారు. సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్‌: జీ 5, కోన ఫిల్మ్, కార్పొరేష‌న్‌, క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌: కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె, సినిమాటోగ్ర‌ఫీ: రామ్ కె.మ‌హేష్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: బ్ర‌హ్మ క‌డ‌లి, ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, స్టోరి రైట‌ర్స్‌: కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు, కాస్ట్యూమ్స్‌: నీర‌జ కోన‌, పాట‌లు: శ్రీజో.

Social Share Spread Message

Latest News