Namaste NRI

సస్పెన్స్‌తో ఆకట్టుకున్న సుయోధన టీజర్

హీరో ప్రియదర్శి నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సుయోధన. ద్రిషిక చందర్‌ కథానాయిక. సాయికుమార్‌, ప్రేమ కీలక పాత్రధారులు. వైఎస్‌ మాధవరెడ్డి దర్శకుడు. బోసుబాబు నిడుమోలు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడారు. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. కథలోని సుయోధన క్యారెక్టర్‌ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయికుమార్‌. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేదే ఈ కథలో ఆసక్తికరమైన పాయింట్‌ అని అన్నారు.

ఇదొక విభిన్నమైన కాన్సెప్టని దర్శకుడు వైఎస్‌ మాధవరెడ్డి చెప్పారు. ఈ సినిమాలో నటించిన తమకే ఈ సినిమా చూస్తున్నప్పుడు నెక్ట్స్‌ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగిందని సాయికుమార్‌ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్ర బృందమంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events