Skip to main content

Namaste NRI

మినియాపోలిస్ తానా తెలుగు పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు, పుస్తకాలు పంపిణి

బాష నాగరికతను నేర్పిస్తుంది – గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు.

అమెరికాలోని మినియాపోలిస్ నగరములో, తానా సంస్థ ఆధ్వర్యంలో తానా నార్త్ సెంట్రల్  రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన తానా తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి పుస్తకాలు పంపిణి చేసారు.

ఈ సందర్భంగా గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు బాషా తియ్యదనం, తెలుగుజాతి గొప్పతనాన్ని అమెరికాలో రుచి చూపించారన్నారు. భాషను భావితరాలకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. ఏ జాతి అయితే తమ మాతృభాషను సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఒక జాతి అస్థిత్వాన్ని ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్న విషయాన్నీ గుర్తించాలన్నారు.

తానా నార్త్ సెంట్రల్ రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని మాట్లాడుతూ భాష ఒక సాంస్కృతిక వారధి. తరాల మధ్య అంతరం రాకుండా మాతృబాష కాపాడుతుందన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. బాష మానవ సంబంధాలు పెంపొందించి సమాజాన్ని విడిపోకుండా కాపలా కాస్తుందన్నారు.  ఈ సందర్భముగా తానా నార్త్ సెంట్రల్ పాఠశాలకు ప్రోత్సాహం అందిస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి గారికి, తానా పాఠశాల చైర్ నాగరాజు నలజుల గారికి కృతజ్ఞతలు తెలిచేయ్యటం జరిగింది.

ఈ కార్యక్రమంలో తానా నార్త్ సెంట్రల్ పాఠశాల కోఆర్డినేటర్ మాలెంపాటి నాగరాజు, తానా కెర్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అరవపల్లి  వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events