ఎన్టీఆర్ జూనియర్ ప్రతిష్టాత్మక యష్‌రాజ్ సంస్థ నిర్మిస్తున్న వార్ -2లో భాగం కానున్నట్టు తెలిసిందే. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం. కియారా అద్వానీ, శార్వరీ కథానాయికలు. తాజాగా ఆయన వార్ -2 లొకేషన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు అరవైరోజుల కాల్‌షీట్స్ కేటాయించిన ఎన్టీఆర్, అందులో 30రోజులు హృతిక్ కాంబినేషన్‌లో నటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన ముంబయి చేరుకున్నారు. యష్‌రాజ్ స్టూడియోస్‌లో నిరవధికంగా పదిరోజుల పాటు తారక్, హృతిక్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగనున్నది. ముంబయి సమాచారం ప్రకారం ఇందులో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న సూపర్ పవర్‌గా కనిపించనున్నారట. నువ్వానేనా అనేలా హృతిక్, తారక్‌ల పాత్రలు ఉంటాయని తెలుస్తున్నది. వార్ లో టైగర్ ష్రాఫ్‌తో ఢీకొట్టిన హృతిక్, ఈ వార్ 2లో తారక్‌తో తలపడనున్నారు. హృతిక్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న సినిమా విడుదల కానుంది.