Skip to main content

Namaste NRI

లండన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

టాక్, బీఆర్‌ఎస్‌  ఎన్నారై యూకే ఆధ్వర్యంలో లండన్‌లో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి నాయకత్వంలో కేక్ కట్ చేసి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుంటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, బీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్ ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్య మూర్తి చిలుముల, టాక్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, వైస్‌ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల , గణేష్ కుప్పాల, ఐటీ, మీడియా , పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ రావు కటికనేని,టాక్ సంస్థ ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ నాగరాజు , స్వాతి బుడగం, క్రాంతి రేటినేని, శైలజ జెల్ల, శ్రీవిద్య ,స్నేహ, దివ్య, పావని, అబ్దుల్ జాఫర్, ఇస్మాయిల్ అబ్బు , సుప్రజ పులుసు, పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News