Skip to main content

Namaste NRI

బీఆర్‌ఎస్‌ -యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలు

 తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని కొలంబస్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ -యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్‌ తన్నీరు మహేష్‌ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు సిద్దిపేట వాస్తవ్యులు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించి, ప్రొఫెస‌ర్ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉమారెడ్డి మాట్లాడుతూ  కేసీఆర్‌ పోరాటయోధుడని, బాల్యం నుండి పట్టుదల ఎకువ, సంకల్పం దార్శనికత, దక్షతకు మారు పేరని గుర్తుచేశారు. ఈ సందర్భంగా. తన చిన్ననాటి తీపి గుర్తులు నెమరువేసుకుని, కేసీఆర్‌ వ్యూహరచన, రాజకీయ చాతుర్యాన్ని కొనియాడారు.   తన్నీరు మహేష్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారన్నారు. ప్రగతి, విద్య, వైద్యం ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్‌, వ్యవసాయ, సాగు, త్రాగు నీరు ఇలా ఏ రంగం తీసుకున్నా, తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు  వేణు పామేర, నరసింహ నాగులవంచ, డేవిడ్‌ విక్రమ్‌, సాజిత్‌ దేశినేని పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News