Skip to main content

Namaste NRI

హైదరాబాదులో జరుగుతున్న 12వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల ఆత్మీయ విందు లో కలిసిన ముఖ్యమంత్రి

బ్రిక్స్ (BRICS) దేశాల కార్మిక ఉపాధి శాఖల మంత్రుల ప్రతినిధి బృందానికి హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా ముఖ్యమంత్రి దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన అతిథులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విందును ఏర్పాటు చేసింది.

ఈ విందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ , కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే , రాష్ట్ర మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events