Skip to main content

Namaste NRI

25 ఏళ్ల క్రితమే నిర్ణయం… రూ.600 కోట్ల ఆస్తి విరాళం

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అరవింద్‌ కుమార్‌ గోయల్‌ ఒక్క ఇల్లు మినహా తనకున్న మొత్తం 600 కోట్ల ఆస్తిని విరామిచ్చారు. పేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం తన యావదాస్తిని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు గోయల్‌ ప్రకటించారు. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్‌ సూచించారు. మొరాదాబాద్‌కు చెందిన గోయ్‌ అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు.  లాక్‌డౌన్‌ సమయంలో 50 గ్రామాల ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్‌కు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారట. ఈ సందర్భంగా గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ నా సంపదనంతా పేదలకు విరాళంగా ఇవ్వాలని 25 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా. ఓ రోజు నేను రైల్లో ప్రయాణిస్తున్న  సమయంలో ఓ పేద వ్యక్తి పరిస్థితి  చూసి నా మనసు చలించిపోయింది. నాకు చేతనైన సాయం చేశా. అయితే ఇలాంటి వాళ్లు దేశంలో ఎంతోమంది ఉంటారు కదా.  వాళ్లకు కూడా నావంతు సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా అని చెప్పుకొచ్చారు.

                 గోయల్‌ తల్లి శకుంతలాదేవి, తండ్రి ప్రమోద్‌ కుమార్‌ ఇద్దరూ స్వాతంత్య్రయోధులు. బావ సుశిల్‌ చంద్ర గతంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. గోయల్‌ కూడా సిబిడిటి చైర్మన్‌గా వ్యవహరించారు. అల్లుడు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తున్నాడు. గోయల్‌ సామాజిక సేవలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్రపతి కోవింద్‌తో పాటు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, అబ్దుల్‌ కలాంల నుంచి ఆయన పురస్కారాలు అందుకోవడం మరో ప్రత్యేకం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events