హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న వైవిధ్యకథాచిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రెండోపాటను మేకర్స్ విడుదల చేశారు. సూడు సూడు సిత్తరాలు.. నట్టింట్లోకొచ్చె సినిమా హాలు.. సూడు సూడు సీరియళ్లు, మరి చాలవంట రెండు కళ్లూ అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా, వంశీకాంత్ రేఖన స్వరపరిచారు. స్వరాజ్ కీర్తన ఆలపించారు. టీవీ, డిష్ వచ్చిన కొత్తరోజుల్లో పల్లెటూరి ప్రజల ఆసక్తిని ఈ పాట కళ్లకు కట్టింది. ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్ రామ్ పొదిశెట్టి.















