Skip to main content

Namaste NRI

సూడు సూడు సిత్తరాలు.. నట్టింట్లోకొచ్చె సినిమా హాలు .. ఆకట్టుకుంటోన్న సాంగ్

హీరో కిరణ్‌ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుమైనా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న వైవిధ్యకథాచిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సాయితేజ్‌, వేద జలంధర్‌ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్‌ డ్రామా త్వరలోనే థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రెండోపాటను మేకర్స్‌ విడుదల చేశారు. సూడు సూడు సిత్తరాలు.. నట్టింట్లోకొచ్చె సినిమా హాలు.. సూడు సూడు సీరియళ్లు, మరి చాలవంట రెండు కళ్లూ అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా, వంశీకాంత్‌ రేఖన స్వరపరిచారు. స్వరాజ్‌ కీర్తన ఆలపించారు. టీవీ, డిష్‌ వచ్చిన కొత్తరోజుల్లో పల్లెటూరి ప్రజల ఆసక్తిని ఈ పాట కళ్లకు కట్టింది. ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్‌ రామ్‌ పొదిశెట్టి.

Social Share Spread Message

Latest News