Skip to main content

Namaste NRI

జార్జ్ క్రిష్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

శర్వానంద్‌ నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం జార్జ్‌క్రిష్‌.మానస వారణాసి కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌బూస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్‌ రెండు విభిన్న మతాలకు చెందిన గెటప్స్‌లో కనిపించారు.

క్రిస్టియన్‌ జార్జ్‌, హిందువు క్రిష్‌ పాత్రల్లో శర్వానంద్‌ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల చుట్టూ ఉన్న విభిన్న పరిస్థితులు ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ పండగ సీజన్‌కి సరిగ్గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జార్జ్ క్రిష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్‌, దర్శకత్వం: శ్రీను వైట్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events