చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మీసాల పిల్ల అంటూ సాగే తొలిగీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ స్వరపరచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఏ మీసాల పిల్ల..నీ ముక్కుమీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల..పొద్దుల్నేచిన దగ్గరి నుంచి రోజూ యుద్ధాలా..మొగుడూ పెళ్లాలంటేనే కంకీకొడవళ్లా అంటూ ఈ పాట సాగింది.

ఈ పాటలో చిరంజీవి స్టెలిష్‌గా కనిపిస్తు తనదైన సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. విజయ్ పొలాకి అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. మొత్తానికి మెగాభిమానులకు ఓ విజువల్ ట్రీట్‌లా పాట మెప్పించింది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
















