Skip to main content

Namaste NRI

మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల

చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్‌ గారు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మీసాల పిల్ల అంటూ సాగే తొలిగీతాన్ని విడుదల చేశారు. భీమ్స్‌ స్వరపరచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ ఆలపించారు. ఏ మీసాల పిల్ల..నీ ముక్కుమీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల..పొద్దుల్నేచిన దగ్గరి నుంచి రోజూ యుద్ధాలా..మొగుడూ పెళ్లాలంటేనే కంకీకొడవళ్లా అంటూ ఈ పాట సాగింది.

ఈ పాటలో చిరంజీవి స్టెలిష్‌గా కనిపిస్తు తనదైన సిగ్నేచర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అలరించారు. విజయ్‌ పొలాకి అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. మొత్తానికి మెగాభిమానులకు ఓ విజువల్‌ ట్రీట్‌లా పాట మెప్పించింది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News