భారతీయుడు సినిమా విజయంతో చిత్రపరిశ్రమలో హిట్ కాంబోగా నిలిచారు ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం భారతీయుడు 2. సీక్వెల్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా దర్శకుడికి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు కమల్. ఈ వాచ్ మార్కెట్ ధర రూ.8.77 లక్షలు . ఈ రోజు ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చూశాను. శంకర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సినిమా నీ జీవితంలో ఒక ఉన్నత శిఖరంలా నిలిచిపోతుంది. ఇది మాత్రమే శిఖరంలా ఉండకూడదనేది నా కోరిక. దీన్ని పైకి తీసుకెళ్లి గర్వపడకండి మీరు ఇంకా పైకి ఎదగాలి అని వ్యాఖ్యల్ని జోడిరచారు కమల్. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై , లాస్ ఏంజెల్స్, తైవాన్, సౌతాఫ్రికా ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆయా లొకేషన్లలో సాంగ్స్‌తోపాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానుంది.