బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ బీరు కు మరీ అంత కాస్ట్ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీరును ఆల్సోప్ కంపెనీ తయారు చేసింది. ఆల్సోప్స్ ఆర్కిటిక్ అలే పేరున్న ఈ బీరు ధరెంతో తెలుసా. అక్షరాలా నాలుగుకోట్లు. ఇంత ధర ఎందుకంటే ఆ బీరు 140 ఏండ్ల క్రితం నాటిది. అందుకే, ఓ వ్యక్తి దీన్ని భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు.














