Skip to main content

Namaste NRI

తండ్రి కొడుకుల ఎమోషన్‌‌‌‌తో కొత్త చిత్రం ప్రారంభం

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న  ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. క్లాప్ శివబాలాజీ, కెమెరా సోలో బతుకె సో బెటర్ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు. అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయాగ, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు.

తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృద్వి,  అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తు న్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది. దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మాటలు సమకూరుస్తూన్నారు. ఎవరూ టచ్ చెయ్యని ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. శశి చిత్ర సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.  ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధు నందన్, ఖయుమ్, భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events