ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన శకటాలు ఆకట్టుకున్నాయి.
























