Skip to main content

Namaste NRI

ప్రేమనే ఊరిలో చిత్రం నుంచి .. అమ్మ ప్రేమ పంచు నాన్నే పాట రిలీజ్‌

శ్రీరామ్‌, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రేమనే ఊరిలో. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చందు శ్రీనివాస్‌, సురేష్‌ కొండేటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి అమ్మ ప్రేమ పంచు నాన్నే అనే పాటను రిలీజ్‌ చేశారు.

ఈ పాటకు సునాద్‌ గౌతమ్‌ స్వరాల్ని అందించగా రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. రామ్‌ మిర్యాల ఆలపించారు. తండ్రి ప్రేమ తాలూకు భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. గ్రామీణ వాతావరణంలో సాగే హృద్యమైన కథాంశమిదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునద్‌ గౌతమ్‌, దర్శకత్వం: మనోజ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events