Namaste NRI

స్టూడెంట్ వచ్చేది ఆరోజే

బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. అవంతిక దస్సాని నాయికగా నటిస్తున్నది. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌  పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు  మంచి స్పందన వచ్చిందని, సినిమాకు కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నట్లు  చిత్రబృందం ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అనిత్ మదాడి, సంగీతం : మహతి స్వరసాగర్.

Social Share Spread Message

Latest News