Skip to main content

Namaste NRI

భారతీయులపై ఎలాంటి నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన‌ సౌదీ

హజ్‌యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలోని సంప్రదాయం ప్రకారం హజ్ సమయంలో రద్దీని నివారించడానికి దేశం స్వల్పకాలిక వీసాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, సౌదీ అరేబియా భారత్‌తో సహా అనేక దేశాలకు బ్లాక్ వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిందని పలు నివేదికలు తెలిపాయి. హజ్‌యాత్ర సమయంలో రద్దీని నివారించడానికి స్వల్పకాలిక వీసాలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ, యాత్ర ముగిశాఖ ఈ ఆంక్షలను సైతం తొలగించనున్నారు.

Social Share Spread Message

Latest News