
తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. జీజీ విహారి దర్శకుడు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరోలు విశ్వక్సేన్, సందీప్‌కిషన్ ఆవిష్కరించారు. పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇదని, రొమాంటిక్ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా మెప్పిస్తుంద ని, సమాజంలోని వైరుధ్యాలను, సామాజిక అంతరాలను చర్చించే సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కథ విన్నప్పుడు అసురన్, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయని, ఏప్రిల్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామ ని నిర్మాత రవి పనస తెలిపారు. విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తన పాత్ర కొత్తగా ఉంటుందని హీరో తిరువీర్ అన్నారు. ఈ వేసవిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: కేపీ, కథ, దర్శకత్వం: జీజీ విహారి.















