Skip to main content

Namaste NRI

ఆత్మహత్య పరిష్కారం కాదని చెప్పే కథ ఇది: శివ శేషు

శివ శేషు దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కలి. ప్రిన్స్‌, నరేష్‌ ఆగస్త్య హీరోలు. రుద్ర క్రియేషన్స్‌ పతాకంపై లీలా గౌతమ్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చ టించారు దర్శకుడు శివ శేషు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌కి ఏడాదిన్నర కేటాయించాం. ఇది ఒకే లొకేషన్‌లో జరిగే కథ కావడంతో ఫిల్మ్‌సిటీలో సెట్‌ వేశాం. ఈ సినిమాకు పనిచేసినవారంతా యంగ్‌ బ్యాచ్‌. జీవితంలో ఎదుర య్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పే కథ ఇది. ఇందులో ప్రిన్స్‌ శివరామ్‌ అనే కేరక్టర్‌ చేశాడు. మంచివాడు, మృదుస్వభావి అయిన శివరామ్‌ సమస్యల్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుం టాడు. ఇంతలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఆ కేరక్టరే నరేష్‌ ఆగస్త్య చేశాడు. అతనొచ్చాక శివరామ్‌ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయ్‌? అనేదే ఈ సినిమా కథ. ఇది రెండు పాత్రల మధ్య నడిచే స్క్రిప్ట్‌. ఇద్దరూ అద్భుతంగా నటించారు. పురాణాల్లో కలి పురుషుడి పాత్రను ప్రేరణగా తీసుకొని రాసుకున్న కథ ఇది అని తెలిపారు. అక్టోబర్‌ 4న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News