Namaste NRI

ఇది నాకు కాదు.. అమెరికాకే అవమానం

ఏడు ప్రపంచ యుద్ధాలను ఆపిన తర్వాత కూడా తనకు నోబెల్‌ శాంతి బహుమతి రాలేదని, ఇది దేశానికే అవమానకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. క్వాంటికోలో ఉన్నతస్థాయి జనరల్స్‌, అడ్మిరల్స్‌ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఏమీ చేయని ఎవరో ఒక వ్యక్తికి ఆ నోబెల్‌ ఇస్తారు. ట్రంప్‌ మేధస్సు, యుద్ధాలు ఆపడానికి అది చేసిన కృషి గురించి పుస్తకం రాసిన వ్యక్తికి నోబెల్‌ ఇస్తారు. నోబెల్‌ బహుమతి ఓ రచయితకు ఇస్తారే కాని యుద్ధాలు ఆపిన ట్రంప్‌కి ఇవ్వరు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే నోబెల్‌ బహుమతి నాకు రాకపోవడం దేశానికే ఘోర అవమానం. నాకోసం అడగడం లేదు. దేశానికి అది దక్కాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన కృషి ఎవరూ ఎక్కడా చేయనిది అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News